rajachandra

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Ramappa Temple Information

రామప్ప దేవాలయం ( వరంగల్లు ):

ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం.
రామప్ప దేవాలయము హైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది వరంగల్లు జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.
దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు.



ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది.
ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణం లో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదలి వేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి.కొంత మంది ఇక్కుడున్న నీళ్ళపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు. అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇపుడు తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుపుతారు.








 
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

Comments

  1. ఈ రామప్ప ఆలయం గురించి చక్కగా చెప్పారు.. కానీ, ఇక్కడ పబ్లిష్ చేసిన ఫోటోలలో 3, 5 & 9 ఫొటోస్ రామప్ప ఆలయం కి సంబంధించినవి కావండీ.. అవి వేయి స్తంభాల ఆలయానికి, మరో ఆలయానికి చెందినవి. గమనించి తొలగించమని మనవి.

    ReplyDelete

Post a Comment