rajachandra

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Mahabalipuram Information in Telugu | Mahabalipuram Guide

మహాబలిపురం టూర్ (Mahabalipuram Information)

మహాబలిపురం (Mahabalipuram) తమిళనాడు రాష్ట్రం కంచి జిల్లాలోని ఒక గ్రామము. కంచి పట్టణానికి 66 కి.మి దూరంలో రాష్ట్ర రాజధాని చెన్నై కి 70 కి.మి దూరం లొ ఉన్నది.  మహాబలిపురం వెళ్తున్న దారిమధ్యలోనే మనకి crocodile పార్క్ కనిపిస్తుంది . ఎంట్రన్సు టికెట్ 25 /- ఉంటుంది . 


మనం లోపలి ప్రవేశించగానే .. ముందుగా  మనకి పాములు , తాబేలులు  స్వాగతం పలుకుతాయి. బయట బోర్డు crocodile అని పెట్టి పాములను చూపిస్తున్నాడు ఏమిటి అనుకుంటూ లోపలి నడుస్తూ ఉంటే , ఒక్కొక్కటి మనకి కనిపిస్తూ ఉంటాయి .



ఒక్కసారి ఈ ఫోటోని చూడండి.. కనిపించిందా .. ఏం తింటుందో ? .. వీటికి ఆహారం ఎలా అని అనుకున్నాం   .. మేము వెల్లిపోదాం ఇంకా అనుకుంటున్నాం .. వీటికి మాంసపు ముక్కలు వేయడం స్టార్ట్ చేసారు .



  అబ్బే పెద్దగ ఏంలేదు అనుకుంటూ  లోపలి వెళ్లేసరికి మనకి పెద్ద మకరమూల  గ్యాంగ్ కనిపిస్తుంది.


ఒక్కోసారి మనకి అవి బ్రతికి ఉన్నాయ్ లేదా అన్నట్టు ఇవిగో ఇలాపడుకునే ఉంటాయ్ అవి ..

 కాస్త అటు ఇటు నడుస్తూ ఉంటే .. మరొక ఫోటో కూడా తీసాను .. చూడండి.

ఈ ఫోటోని మాత్రం చాల జాగ్రత్తగా చూసి .. బాబోయ్ ఎన్ని ఉన్నాయ్ అనుకోండి 
మీకు చెట్ల క్రింద రాళ్ళ లాగా కనిపిస్తున్నాయ్ కదా .. అవి రాళ్ళు కాదు .. చెట్ల నీడ కాదు ..

 మహాబలిపురం చూద్దాం రండి :
7 వ శతాబ్ధంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణం. మామల్లాపురం అనేది మహబలిపురానికి వున్న మరో పేరు. ఈ పట్టనణానికి అప్పటి పల్లవ ప్రభువైన మామ్మల్ల పేరు మీద కట్ట బడిందని చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కధనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. తదనంతర కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు. అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద. పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు.
 It was originally constructed during the 7th century and later it was Narasimha Varman II, (Rajasimha) completed the skilled work in his rule. This is one of the oldest of the south Indian Temples which were structural temples constructed in the nature Dravidian style. This shore temple has gained popularity and tourists gather here because it has been listed among the world heritage sites of the UNESCO. The temple is full of designs made by carvings


  There are three temples of which two Shiva Temples face east and west respectively. The other one is the Vishnu Temple. The Vishnu temples were built by Narasimha Varman I and the other two were built by Narasimha Varman II. One can find the beautifully carved twin Dwarka Palaks (gate keepers) at the entrance of the east facing Shiva Temples. 
On both sides of the temple inside are the marvelous sculptures of Lord Brahma and Lord Vishnu with their better halves. The top part of the Shivalinga figure inside the temple is found damaged. There are sculptures of Somaskanda - lord Shiva with his better half, Parvati, and his sons, Skanda and Ganesha are found on the near wall. Apart from Lord Shiva’s sculpture, one can find the sculptures of Narasimha and Goddess Durgha also.


మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణాలు .....







ఆరోజుల్లోనే ఇలాంటి నిర్మాణాలు చేయడం అంటే మాటలా... ఎటువంటి టెక్నాలజీ లేకుండా రాయిని గుడిగా మార్చడం అంటే ..



ఇక్కడ సముద్రం చాల అందంగా కనిపిస్తున్న .. కెరటాలు మాత్రం దూసుకుని వస్తూ ఉంటాయ్.

   నేను అనుకోవడం ఎక్కవలోతుకి వెళ్ళడం మంచిది కాదు.
 మీకు మహాబలిపురం రాగానే దృష్టి అంతా వీటిపైనపడుతుంది ..
 మన ఇంట్లో పెట్టుకోవడానికి వీలుగా చిన్న చిన్న బుద్ధా విగ్రహాలు , వినాయకుని విగ్రహాలు దొరుకుతాయ్ .. 

 Pancha Rathas :
బీచ్ దగ్గరనుంచి ఒక కిలోమిటర్ దూరంలో పంచరధాలు ఉంటాయ్ .. చూడటానికి టికెట్ తీసుకోవాలి (10 /- ) .. టికెట్ ఎంట్రన్సు గెట్ దగ్గర కాకుండా  .. బయట ఇస్తారు .. వెళ్తున్న దారిలోనే బోర్డు ఉంటుంది .. ఒకవేళ చూడకుండా వెళ్ళిపోయినా .. ఎంట్రన్సు నుంచి  దగ్గరే కాబట్టి బయపడనవసరం లేదు .


రధాలు అన్నారు కదా అని వీటికి చేక్రాలు ఉంటాయ్ అనుకోవద్దు .. ఇక్కడ పాండవులతో పాటు ద్రౌపతి కి కుడా రధం ఉంటుంది. అవి వరుసగా ద్రౌపతి ,భీమ ,అర్జున ,ధర్మరాజు , నకులుడు & సహదేవుడు (ఏనుగు ఎదురుకుండా ఉంది కదా అదే ) ఒక రధం ఉంటుంది.

మీరు చూస్తున్నది ద్రౌపతి రధం  (Draupadi ratha)

నేను ఏన్ని సార్లు వెళ్ళిన నాకు కొత్తగానే కనిపిస్తాయ్  ఇవి ... నాకు రధాలను చూస్తూ ఉంటే.. ఇవి చేక్కినవి మనవాళ్ళు .. నేను ఇండియన్ ని అని గర్వపడుతుంటాను .. వీటిని చేక్కినవాళ్లు ఈ రోజుల్లో ఉండి
ఉంటే మనకు ఉన్న టెక్నాలజీ కి వాళ్ళు ప్రపంచ వింతల్లో మహాబలిపురం కూడా ఒకటిగా ఉండేలా చేసేవాళ్ళు.


అర్జుని రధం Arjuna Ratha

ద్రౌపతి రధానికి అర్జున రధానికి తేడా కనిపించిందా...  వెనకాలే నంది ఉంది చూడండి మళ్ళి ఒకసారి

ఇక్కడ ఏక శిలపై చెక్కిన ఏనుగు , సింహం ,నంది ఉంటాయి ..



భీముడు అని అంటేనే పెద్ద శరీరం ఎలామనకు కనిపిస్తుందో అయన రధం కూడా అలానే ఉంటుంది .. :)

 భీముని రధం..Bhima Ratha


ఈ ఫోటో చూడండి.. చివరిది ధర్మరాజు గారిది.. పక్కది భీముని రధం, పైన గుండ్రంగా కనిపిస్తుంది కాదా అది అర్జున రధం , పక్కది ద్రౌపతి రధం (మీకు పైనే చూపించాను కాదా ద్రౌపతి రధం.) ఇవి నాలుగు నిర్మాణాలు నాల్గు రకాలుగా ఉంటాయ్ .. మీరు వెళ్ళినప్పుడు గమనించండి.. 
 ధర్మరాజుగారి రధం ..Dharma raju ratha 
రధం ఏదురుగ ఒక రాయి కనిపిస్తుంది చూసారా .. అక్కడ గుర్రాలను చెక్కుదాం అనుకున్నారంటా ఈలోపు యుద్ధం రావడం వాళ్ళ ఇలా రాయిగా మిగిలిపోయింది .. నిజానికి వీటి నిర్మాణాలు పూర్తీ అయివుంటే .. ప్రపంచ వింతల్లో వీటికి చోటు దక్కేదేమో..



ధర్మరాజు గారి రధం వెనకాల మనం అర్ధనారీశ్వర నిర్మాణాన్ని మనం చూడవచ్చు ..



ఇలా మధ్యలో రంద్రాలు చేసి రాయిని పగల కొడతారు ....


 వీటిని చూసివస్తున్నా దారిలో కొండపైన లైట్ హౌస్.. కనిపిస్తుంది .. 
వీటితోపాటు కొండపైన చెక్కిన నిర్మాణాలు కూడా చూడవచ్చు ..

లైట్ హౌస్ పైకి ఎక్కి చూడటానికి 10 /- టికెట్ ఉంటుంది .. అక్కడ నుంచి మహాబలిపురం ఇంచుమించు కనిపిస్తుంది.


 మహాబలిపురం లో చూస్తున్నా కోద్ది.. ఎలాంటి విగ్రహాలు రోడ్ పక్కనే ఉంటాయ్.. అక్కడకు వెళ్ళిన వెంటనే వాతావరణం మరీపోతుంది .. మనవాళ్ళ టాలెంట్ చూసి గర్వంగా ఫీల్ అవుతారు ..


బస్సు స్టాండ్ అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండదు . మహాబలిపురం ఉన్న టెంపుల్ దగ్గరకు తీసుకుని వెళ్తారు . టెంపుల్ అంటే పైన చూపించిన టెంపుల్ కాదండి .. పైన చూపించిన టెంపుల్ లో పూజలు ఏమిజరగావు . స్వామివారికి పూజలు ఇక్కడ మాత్రమే జరుగుతాయ్ .. లోపల విష్ణుమూర్తి ఉంటారు .. గుడికి వెళ్ళడం మరవకండి .. ఎందుకు చెప్పానో వెళ్ళిన తరువాత మీకే  తెలుస్తుంది.


 గుడికి ఏదురుగా సముద్రం ఉంటుంది .. మరీ దగ్గరలో కాదు కాస్త నడవాలి .. గుడికి కుడిచేతివైపుకి నడిస్తే పంచరధాలు, వెనకవైపుకి వెళ్తే ఇవిగో ఈ క్రింది చూపిస్తున్న ప్లేస్ కి వెళ్తారు......


 చూస్తున్నారా మనవాళ్ళ శిల్పకళ నైపుణ్యం ..!
 మన వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో చూడండి.. ఎంతమంది చెక్కి ఉంటారో  .

ఇక్కడ నుంచి ..అదేనండి గుడి వెనకకు వచ్చి రైట్ సైడ్ వెళ్తే పంచరాదాలు వస్తాయ్... ఇలాగా కూడా వెళ్ళవచ్చు..

ఈ క్రింద ఫోటో లో ఏముంది అనేకదా చూస్తున్నారు .. ఈ లోపల లక్ష్మి దేవి మరియు వామనావతారం .. చెక్కిన శిల్పాలు ఉంటాయ్ .. ఇంకా కాస్త పైకి వెళ్తే .. మరిన్ని చూడవచ్చు.


మహాబలిపురం లో కొండను ఎక్కడ కలిగా ఉండలేదు .. ప్లేస్ కనిపిస్తే చాలు మనవాళ్ళు చెక్కడం మొదలు పెట్టేసారు అనిపిస్తుంది చూస్తుంటే..
 వినాయక రధం 
వినాయక రధం ఒకటే పూర్తీ అయి ఉన్నట్టు  కనిపిస్తుంది మనకు

మేము వెళ్ళినప్పుడు వినాయక చవితి అందువల్లే .. మామిడితోరణలు కట్టారు ..

 శ్రీ కృష్ణుని వెన్న ముద్దా ....

ఏటవాలు కొండపై ఏ ఆధారమూ లేకుండా ఆ కాలమునుండి పడిపోకుండా అలాగే వుంది. ఇది ఒక విచిత్రం.

వీటిని చూసిన తరువాత .. కాస్త ముందుకి వెళ్తే .. త్రిమూర్తులు కూడా కనిపిస్తారు ..
మీరు ఇలా స్టార్ట్ చేయండి :
ముందుగా బీచ్ దగ్గర ఉన్న టెంపుల్ ని చూసి అక్కడ ఆటో మిద అయిదు రధాలు ఉన్నచోటికి వెళ్ళండి (ఆటో వాడు 30 అడుగుతాడు .. మనవాళ్ళు పెట్రోల్ రేట్ పెంచకపోతే  ) . చూసాక అక్కడనుంచి లైట్ హౌస్ ఇంకా లైట్ హౌస్ దగ్గరలోనే మరికొన్ని నిర్మాణాలు ఉంటాయ్ ... అవికూడా చూసి కొండ క్రిందకు వచ్చేయండి .. దారిలోనే పైన ఫోటోలో ఏనుగు చూసారు కదా .. పంచారధాల దగ్గర ఏనుగు కాదండి .. మరో రెండు ఏనుగులు ఉన్నాయ్ కదా అవిచూసి.. వెన్న ముద్దా కూడా చూసి .. ఎడమ చేతివైపుకు వెళ్తే . వినాయక  రధం .. ఇంకా కాస్త పైకి వెళ్తే .. వామనావతారం  ఉన్న గుహ .. కాస్త ముందుకు వెళ్తే ,,మరొక గుహ (గుహ అంటే ఏదో అనుకోకండి కొండని కాస్త లోపలి చెక్కినది ) అక్కడ కనక దుర్గ అమ్మవారు కనిపిస్తారు ..అవి చూసి వెనక్కి వచ్చి వెన్న ముద్దా దాటుకుంటూ వెళ్తే .. త్రిమూర్తులు కూడా కనిపిస్తారు (వారి లో బ్రహ్మ ఎవరో , విష్ణు ఎవరో చెప్పండి చూద్దాం ).

చివరిగా బస్సు స్టాప్ దగ్గరకు వచ్చి టెంపుల్ లోపాలకి వెళ్ళండి ,గుడి 4 తరువాత తెరుస్తారు.
అవును నేను ఇంకా తిండి  కోసం చెప్పలేదు కదా .. భోజనానికి ఎటువంటి ఇబ్బంది పడనవాసరం లేదండి అన్ని దొరుకుతాయ్.. మీకు కావాల్సిన పూసలు .. రాయితో చెక్కిన శిల్పలు కూడా మీదగ్గరకు  వచ్చే కావాలా అని మరీ అడుగుతారు ..  ఇంక చాలు లెండి ఇప్పడికే చాల రాసాను  కాదా .. ఇంక ఉంటాను .. :)
mahabalipuram information in telugu, mahabalipuram distance, history of mahabalipuram, mahabalipuram tour guide, 
****మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి ****


Comments

  1. nice one...raja. Bhaga explain chesaav.

    ReplyDelete
  2. "నేను ఏన్ని సార్లు వెళ్ళిన నాకు కొత్తగానే కనిపిస్తాయ్ ఇవి ... నాకు రధాలను చూస్తూ ఉంటే.. ఇవి చేక్కినవి మనవాళ్ళు .. నేను ఇండియన్ ని అని గర్వపడుతుంటాను .. వీటిని చేక్కినవాళ్లు ఈ రోజుల్లో ఉండి
    ఉంటే మనకు ఉన్న టెక్నాలజీ కి వాళ్ళు ప్రపంచ వింతల్లో మహాబలిపురం కూడా ఒకటిగా ఉండేలా చేసేవాళ్ళు."
    తమ్ముడూ...... ఇది నీవు వ్రాసినదే ... ఎంత చక్కగా వ్రాసావ్!
    గుడ్..మీ ప్రతాప్..

    ReplyDelete
  3. c.v.rao garu late ga mi comment ki reply pedutunnanduku sorry andi.. comment post chesinanduku tq andi..

    ReplyDelete
  4. pratap garu ... nenu vrasanu andi ... vatini chustu unte.. manaki janaganamana vente ela untundo vatini chustu unte manaki ade feeling kalugutundi andi

    ReplyDelete
  5. Good One..Rajaa.... So, next time Chennai vacchinappudu.. you should guide us to these places...! anyhow.. thanks for the information dude..!!

    ReplyDelete
  6. Forgot to tell you.. please continue blogging.. you are doing a fantastic job.. Manchi interesting topics gurinchi... regular gaa blog cheyyu..

    ReplyDelete
  7. Thank you chandu garu..tappakunda guide chestanu andi... okavela nenu tappinchukunna.. na blog miku use avutundi.

    ReplyDelete
  8. chalabaga baga vivarincharu..

    ReplyDelete
  9. hi,
    rajachandra baga enjoy chestunnav annamata, nice pics , baga enjoy chey

    ReplyDelete
  10. చాలా బాగా, సులభముగా అర్థమయ్యే తీరుగా చెప్పారు. మీ సచిత్ర ప్రయాణ గాథ వింటుంటే - ఒక గైడ్ చూడ చక్కని ప్రదేశాలని వెంటుండి మరీ మరీ మాకు చూపినట్లుగా ఉంది. మీకు కృతజ్ఞతలు.. మరెన్నో ప్రదేశాలని మీ బ్లాగ్ ద్వారా చూడాలని అనుకుంటున్నాను..

    ReplyDelete
  11. రాజ్ గారు చాల సంతోషం అండి మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు.

    ReplyDelete
  12. బాగా రాశారు రాజాచంద్రగారూ. చాలా ఫోటోలు పెట్టారు. బాగున్నాయి.
    psmlakshmi

    ReplyDelete
  13. rajachandra garu,
    miru echhina information chala bagundi. memu ee pradesamaina chudalani anukunte mundugaa mi blog chusi vellavachhu. anta baga vivaram gaa rasaru.Thanks.

    ReplyDelete
    Replies
    1. miku nachhinanduku tq. andi. naa blog miku use avutundi ani cheppinanduku chala santoshanga undi.

      Delete
  14. "రాజా చంద్ర" గారూ మీ బ్లాగ్ చదువుతుంటే మీతో పాటు మేము కూడా
    ఆ ప్రదేశాలన్నీ చూస్తున్నట్లే అనిపిస్తుందండీ..

    నాకు కూడా మీలాగ కొత్త కొత్త ప్రదేశాలు,ఎక్కువగా ఆలయాలు చూడటం
    వాటి గురించి నా బ్లాగ్లో రాయటం ఇష్టం.

    మీ బ్లాగ్,మీరు చూసిన ప్రదేశాలను చూస్తుంటే నాకు అనిపిస్తుంది మీరు చాలా అదృష్టవంతులని..
    ఇంకా మంచి మంచి ప్రదేశాలు చూసి మాకు కూడా చెప్పెయ్యండి ఆ వివరాలన్నీ..

    All The Best..

    ReplyDelete
    Replies
    1. రాజి గారు నా బ్లాగుని చూసి కామెంటు కూడ రాసిందుకు చాల థాక్స్ అండి. తప్పకుండ నేను చూసిన ప్రదేశాల విషయాలను మితో పంచుకుంటాను.

      Delete
  15. మీ బ్లాగ్ చాలా బాగుంది. మహాబలిపురం అయితే చాలా బాగా వివరించారు.
    keep going :) :)

    ReplyDelete
  16. meeru chala vipulanga chupincharu mikrusi hatsoff


    ReplyDelete
  17. SRI RAJACHADRAGAARU., MAHABALIPURAM YATRA CHEYINCHINAARU. INTA VIPULAMGAA PHOTOLATO VIVARAARU TELIPINA MIIKU NAA DHANYAVAADAMULU TELUPUTUNNAANU. KATAKAM VEERABHADRA RAO., KAKINADA.

    ReplyDelete
  18. meeru chala baga suluvuga andariki ardhamayye vidhamga rasaru sir really u did a good job

    ReplyDelete
  19. ramachandra your so grete man thankyu very much sir

    ReplyDelete
  20. chala bavundandi meme swayamga velli chusinattuga undi. chala thanks

    ReplyDelete
  21. Sairam my dearest br,
    Very very thanks, U have given all information to visitors.
    Once again thanks for u r pain taken to loading these photos.

    ReplyDelete
  22. Wow.. this is so amazing.. :)

    ReplyDelete
  23. NICE thanks you brother. nenu okka sari ina velthanu.

    ReplyDelete
  24. thanks for ur valuable information it is very useful new visitors

    ReplyDelete
  25. thanks for ur valuable information it is very useful new visitors

    ReplyDelete
  26. Chala Baagunnai blog lo vishayaalu. Thanks

    ReplyDelete
  27. చాలా బావుంది.. కళ్ళ ముందు మరల కదలాడింది... కొత్తగా వెళ్ళే వారికి చాలా చాలా సహాయకారిగా ఉంటుంది.. మీ సమాచారం.. మధురై కు వెళ్ళే టపుడు మీ బ్లాగు చాలా ఉపయోగపడింది.. Thank you so much brother..

    ReplyDelete
  28. Mahabalipuram is one of the beautiful places.It was really wonderful to read Your blog as i got a lot of information from your blog.If any one want to travel to Mahabalipuram you can book tickets in Leading bus ticket booking portal.

    ReplyDelete
  29. Iam visited this place.
    You are explained very well

    ReplyDelete
  30. సార్ మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది సార్, ధన్యవాదాలు సార్ తమరికి

    ReplyDelete

Post a Comment