Srirangam Temple Information

శ్రీరంగం - తమిళనాడు   | Srirangam Temple Informationశ్రీరంగం (Srirangam ) ఉభయ కావేరీ నదుల మధ్యనున్న పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశం . ప్రత్యేకంగా చెప్పాలా ? ఒకసారి పైన ఉన్న ఈ ఫోటో చూస్తుంటేనే ఎక్కడో ఉందో తేల్సుకుని .. శ్రీరంగం ఎంత త్వరగా కుదిరితే ( స్వామి ఎంత త్వరగా పిలుస్తే ) అంత త్వరగ చూడలనీపిస్తూంది కదా ! .. మనకేమిటి శ్రీరంగ నాధుడికే అనిపిస్తే అలా ... 


స్థలపురాణం తరువాత చెప్పుకుంద్దాం .. ఎలా వేళ్ళలో చెప్పితే మీరు ఎలా రావాలో మీకో ఐడియా వస్తుంది .
తమిళనాడులోని తిరుచినాపల్లి (తిరుచ్చి) ( Trichy - Tiruchirappalli )కి10 కిమీ దూరం లో ఉంది . తిరుచినాపల్లి ఎక్కడుంది అనేగా చెన్నై నుంచి 330 కిమీ దూరం . శ్రీరంగం లో రైల్వేస్టేషన్ ఉంది . IRCTC కోడ్  SRGM .  చెన్నై నుంచి  వెళ్తే శ్రీరంగం స్టేషనే ముందు వస్తుంది తరువాతే తిరుచినాపల్లి.
తిరుచినాపల్లి నుంచి మీరు శ్రీరంగం వెళ్తుంటే చూస్తున్నారుగా ఈ బ్రిడ్జి మీదే వెళ్ళాలి ..


ఇక్కడ నుంచి చూస్తుంటేనే అబ్బ బలే ఉంది ప్లేస్ అని పిస్తుంది కదా !


 ఇప్పుడు మనం శ్రీరంగం రైల్వే స్టేషన్ లో ఉన్నాం . ..


 ఇక్కడ చూసారా వీళ్ళు .. రైల్వే స్టేషన్ దగ్గరే మనకు శ్రీరంగ నాధున్ని దర్శనం చేయిస్తున్నారు ..


 మనం బయటకు రాగానే .. ఆటో లో కాస్త ఏదురుగా ATM కూడా ఉంది . ఇప్పుడు ATM కదా అవసరం ..

ఓకే అర్ధం అయింది .. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ ఎంత దూరం అనేగా .. ఇక్కడ నుంచి సుమారుగా 1 కిమీ దూరం ఉంటుంది . ఆటో లో వెళ్తారో నడిచి వెళ్తారో మీ ఇష్టం .
 నడిచే వెళ్తాం అనేవాళ్ళు .. చూస్తున్నారుగా రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వస్తే .. మీకు రోడ్ కనిపిస్తుంది అక్కడ ఎడమవైపుకి తిరిగి నలుగు అడుగులు వేయగానే ..  కుడివైపు మరో రోడ్ వచ్చి ... ఈ బోర్డు కనిపిస్తుంది . ఈ బోర్డు కనిపించగానే మనకి కాస్త దైర్యం వస్తుంది :)అక్కడ నుంచి నడుస్తూ కొద్ది దూరం రాగానే .. మెయిన్ రోడ్ వస్తుంది ... ఎలా వెళ్ళాలి ... ఎటువైపుకి వెళ్లాలి అనుకుని అటు ఇటు చూస్తుంటే .. మనకు శ్రీరంగ దేవాలయం యొక్క గోపురం కనిపిస్తుంది . అప్పుడు కలిగే ఆనందం బలే ఉంటుంది . ఇంకా ఎవరిని ఏమి అడగనవసరం లేదు అమ్మయ్య .. స్వామి వచ్చేసాను .. వస్తున్నాను అనుకుంటూ .. నడక సాగించడమే ..

నడుస్తూంటే .. గోపురం ఇంకా ఇంకా దూరం జరుగుతునట్లు అనిపిస్తుంది .

 ఆ గోపురం చూస్తుంటేనే .. మనకు తెలియకుండా .. ఆనందం తో ఒళ్ళు పులకరిస్తుంది .. అబ్బ మనవాళ్ళు ఏమి కట్టారు .. ఎంత అదృష్టం చేస్కున్నాను ఈ దేశం లో పుట్టి .. మనవాళ్ళు చాల గోప్పుల్లు అనుకుంటూ .. ముందుకు కదులుతాం ..
 ఫోటో దగ్గర నుంచి తీయడానికి కెమెరా కు పడితే కదా ... :)  మనం తల బాగా పైకి ఎత్తి చుడవాల్సిందే ..
 దీని ఎత్తు 236 అడుగులు (72 మీటర్లు) - ఆసియాలో అతిపెద్ద గోపురం.

 దేవాలయం వారి వెబ్‌సైటు ప్రకారం ఈ ఆలయం ప్రదేశ వైశాల్యం 6,31,000 చదరపు మీటర్లు (156 ఎకరాలు). ప్రాకారం పొడవు. 4 కిలోమీటర్లు (10,710 అడుగులు). ఇక్కడ నుంచి మనం ఒక్కో గోపురం దాటు కుంటూ .. ముందుకి నడుస్తూ వెళ్ళాలి ... ఈ గోపురాలు కూడా చిన్నవి గా ఉండావ్ .. చుట్టూ షాప్ లతో రద్దీగా ఉంటుంది ..

గుడినుంచి వచ్చేటప్పుడు కొనుక్కోవచ్చు .. పదండి పదండి ..  :)
 కొబ్బరి కాయ దేవాలయం లో కొట్టరు .. పువ్వులు మాత్రమే తీస్కుంటారు .. మనం నడుస్తూనే ఉంటాం .. గోపురాలు వస్తూనే ఉంటాయ్ ..


 అందరు ఒక్కసారి గోవింద గోవిందా .. అని గట్టిగ అనండి .. గోవింద గోవిందా సామాన్లు పెట్టుకోవడానికి  .. చెప్పులు పెట్టుకోవడానికి ఆలయం వారు ఏర్పాట్లు చేసారు .. మీరు కంగారు పడి బయటే వదలనాసరం లేదు .


 టికెట్స్ లోపల తీస్కొవచ్చు .. రండి
 మన అదృష్టం కొద్ది ఇంగ్లీష్ లో కూడా బోర్డు లు పెట్టారు .. :)

ఈ ఆలయం లో ఎక్కడ చూసిన గోపురాలు మండపాలు .. కనిపిస్తూనే ఉంటాయ్ ..
 మీరు ఎలా వేళ్ళలో బోర్డు లు చూస్తున్నారుగా .. ఏమేమి చూడాలో ..ఎలాగో ఆలయం లో కి వచ్చేసాం కదా .. తరువాతి పోస్ట్ లో స్థలపురాణం .. లోపల చుడవాల్సిన వాటికోసం .. చుట్టుప్రక్కల చూడవల్సిన ప్రదేశాల కోసం వివరిస్తాను .

మీ సలహాలను .. మీకు తెల్సిన ఇతర విశేషాలను కామెంట్ చేయండి ...
గోవింద గోవిందా ..
Share on Google Plus

About Raja Chandra

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

5 comments:

 1. Ee kshanam lone Srirangam vellipovalani manasu tondarapedutunnadi. Thanks for this beautiful post!

  ReplyDelete
 2. namasthe,
  Meeru ichina information chaalaa baagundi ,. kotha vaaru elanti bhayam lekundaa vellavachhu.
  nenu 4 months back vellanu.

  ReplyDelete
 3. చాల మంచి సంగతులు తెలిపినరు. ధన్యవాధములు

  ReplyDelete
 4. Good article about srirangam temple.Book your in SRS Travels

  ReplyDelete

Lord Shiva Temples

Have You Visited These Temples

Contact:

కోత్తగా వెబ్సైటు స్టార్ట్ చేశాను .. చూసి మీ సలహాలను ఇవ్వగలరు . www.hindutemplesguide.com

Sponsor

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu